PM Modi: మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ...! 9 d ago
భారత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ప్రధాని మోడీ నివాళులర్పిచారు. మన్మోహన్ సింగ్ నివాసంలో వారి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. అలాగే మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.